పరిపూర్ణ దైవీసంపద, అత్యంత కఠోర నియమపాలన, తీవ్రాతి తీవ్రమైన తపస్సు,అచంచలమైన శ్రద్ధ ,అపారశాస్త్ర పాండిత్యము,అనన్యమైన దైవీ ధర్మ కార్యనిర్వహణ వారిని ప్రపంచం నలుదిశలా మరో శంకరాచార్యులు గా ప్రసిద్ధి పొందేటట్లు చేసాయి.
పరమాచార్యులవారు. తమిళనాడులో, వేలూరు. నందు స్మార్తహొయసల కర్నాటక బ్రహ్మణ కుటుంబంలో 1894 మే20న అనూరాధనక్షత్రంలో జన్మించారు స్వామి తల్లిదండ్రులు మహాలక్ష్మీ, సుబ్రహ్మణ్య శాస్త్రి. జిల్లా విద్యాధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి స్వామివారు రెండవ కుమారుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి. స్వామికి జన్మించినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్. స్వామినాథన్ దిండివనంలో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు . స్వామికి 1905 సం. లో ఉపనయనం జరిగింది.
13వఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచికామకోటిపీఠం అధిష్టించారు. చంద్రశేఖరేంద్రస్వామివారు. కేవలం పీఠాధిపతే కారు .వారి లో ఒక వేదరక్షకుడు , ఒక శాస్త్రపరిశోధకుడు, రాజకీయవేత్త ,చారిత్రకపరిశోధకుడు, జ్యోతిశ్యాస్తవేత్త,బహుభాషాపండితు. డు (ఇంగ్లీషు , ఫ్రెంచి , హిందీ , తమిళం, కన్నడ, బెంగాలీ, తెలుగు లతో పాటు 17 భాషలు లో నిష్ణాతులు) ఉన్నారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారి జీవితంఅద్భుతం,మహిమాన్వితం. నిండునూరేళ్ళు (1994 జనవరి 8 వరకు ) విలక్షణమైన జీవితాన్నిగడిపి, పాదచారియై ‘దేశమంతాసంచరిస్తూ ధర్మప్రభోదాలుచేసి ,దైవశక్తిని నిరూపిస్తూ ననాతనధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు శ్రీస్వామివారు.
స్వామివారి శారీరకశ్రమ ఊహకే అందనిది .1919లో మొదలుపెట్టిన పాదయాత్ర 21 సం.ల పాటు సాగింది .కొన్ని లక్షలమందిని అనుగ్రహిస్తూ ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తూ చేసిన ఈ యాత్ర లో 1927 లో పాల్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ తో కొన్ని గంటలపాటు, చర్చలు జరిపారు.
గాంధి గారు భోజనం చేయటం మరిచిపోతే రాజాజీగారు (C.రాజగోపాలాచారి) రాత్రి భోజనానికి గుర్తుచేస్తే గాంధీగారు మహాస్వామిని ఉద్దేశించి ‘ఈ మహానుభావునితో మాట్లాడుతుంటే నాకు కడుపు నిండిపోయింది. ఇంకనాకు భోజనం అవసరం లేదు’ అన్నారు .
“కౌపీన వంతః ఖలుభాగ్యవంతః” అన్న శంకరుల వాక్యాలకు ప్రమాణంగా. జీవించారు శ్రీ స్వామివారు .కోట్ల విలువచేసే మఠం ఆస్తులు ,లక్షలాది భక్తులు ఉన్నా, పట్టు పరుపులతో ఊరేగేసొకర్యంఉన్నా స్వామివారు వాడేది చెక్క పాత్రలు,పడుకునేది అంగవస్త్రం పరచిన కటికనేల భయంకరమైన ఎండలలో పర్యటించే టప్పుడు కూడా స్వామివారు కాళ్ళు చాపుకోటానికి కూడా వీలులేని , గాలికూడారాని ఇరుకు మేనాలోనే విశ్రమించేవారు. సౌచామనములకు తప్పించి నీరు కూడా తీసుకునేవారు కాదు. సంవత్సరంలో సగం రోజులుఉపవాసం,చాలారోజులు కాష్ఠమౌనం, ఏకాదశి ఉపవాసం, సాయంత్రం త్రయోదశి ఘడియలు వస్తే ఉపవాసం,నవరాత్రులులో ఉపవాసం. 1 4ఏళ్లకేఉప్పు,చింతపండు, మిరపకాయలు వదిలేసారు. కొన్నాళ్ళు కేవలం పచ్చిఆవుపాలు,మరికొన్నాళ్ళు కేవలం మూడు పిడికిళ్ళు అన్నం, ఇంకొన్నాళ్ళు కేవలం పెరుగులో నానబెట్టిన పేలాలు … ఇలా అత్యంత కరోర నియమపాలన తో జీవించారు.
ఒకసారి ఒక ట్రస్ట్ లోని డబ్బులు పొరపాటున వేరొక ట్రస్ట్ లోని కార్యక్రమాలకు వాడటం జరిగింది . అది ట్రస్ట్ నియమాలకు విరుద్ధమని తరువాత తెలిసింది . ఆడబ్బు తిరిగి మొదటి ట్రస్ట్ లో జమకట్టే ఏర్పాటు చేసినంతవరకూ ఉపవాసం చేసారు స్వామివారు
పరమాచార్యుల వారికి నాలుగుసార్లు 1954,1957,1965 మరియు 1993 లలో కనకాభిషేకం జరిగింది .వారిని సన్మానించిన వారిలో, భక్తులలో ,సర్వజాతుల వారు ఇతర మతాలవారు, విదేశాలవారు ,సామాన్య మానవుల నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ల వరకుఉన్నారు . అందరి గౌరవ వందనాలను పొంది వారిని అనుగ్రహించారు
“ స్వామి వారిని ఎందుకు అర్చించవలె” — సమస్త సాధకములందు ఉత్ముష్టతనొందిన మన కంచి యోగీంద్రులను అర్చించినట్లయితే మనము కోరుకున్న సిద్ధి లభిస్తుంది . బ్రహ్మ నుంచి చీమ వరకు ఉన్న సమస్త ఉపాధుల్లోను వ్యాపించి ఉన్న ‘బ్రహ్మపదార్థమును చూడగలిగిన ప్రజ్ఞ వారికి ఉంటుంది” అంటారు బ్రహ్మశ్రీ కుప్పా లక్ష్మావధాన్లు గారు
పరమచార్యులవారు తామెవరో తెలియపరిచిన ఒక సందర్భం : తమిళనాడులో పొల్లాచ్చి నుంచి వచ్చిన మహిళ వ్రతం కట్టుకునే తోరణాన్ని వారికిచ్చింది . మహాస్వామి దానిని తలపై ధరించారు .అది కిందికి జారి కన్నుకి అడ్డంగా ఉందని ఒక శిష్యుడు అద్దు తీయబోయాడు . వెంటనే స్వామివారు “దాన్నెందుకు తీస్తావు? అది నోములకు కట్టుకునే తోరణం. ఆ అమ్మగారిచ్చింది స్త్రీలందరూ తోరణాలను అమ్మవారికి అలంకరించడం అనవాయితీ .కానీ ఈమెదృస్టిలో నేనే అమ్మవారు. అందుకే ఆమె దానిని నాకు సమర్పించింది” అన్నారు.
వేరొక సందర్భంలో ఒక చిత్రపటం చూసారు. అందులో మూడుచిత్రాలు- ముందుగా దక్షిణామూర్తి ,తరువాత ఆది శంకరులు , ఆ చిత్రాలకు క్రింద పరమాచార్యులది. ఉన్నవి .దాన్ని చూపిస్తూ ఈ చిత్రం లో ముగ్గురు చిత్రాలను మాత్రంఎందుకు చిత్రించారు? అని ప్రశ్నించి , జవాబు కూడా ఆయనే ఇచ్చారు ” ఈయనే ఆయన, ఆయనే ఈయన” అని వేలుపెట్టి చూపుతూ “అందువలననే ఇలా చిత్రించారు” అని తన అవతారాన్ని స్పష్టంగా. తెలియపరిచారు.