కాలప్రవాహంలో వైదికమతం లో ప్రాంతీయ ఆచారాలతో ,సిద్ధాంత విభేదాలతో, అనైక్యతతో పాటు అనేక దురాచారాలు ప్రవేశించాయి . ఆ లోపాలను ఎత్తి చూపుతూ వైదిక మతాలను నిరసిస్తూ వ్యతిరేకంగా అనేక ఇతర మతాలు ముఖ్యంగా జైన, బౌద్ధ మతాలు, ఎదురుదాడి చేస్తున్నాయి . వేదాల ఉనికికే ప్రమాదం ఏర్పడిన ఆపరిస్థితుల్లో ఆది శంకరులు, బౌద్ధ, చార్వాకాది 108 మతాలను ఖండించి వారిని తన జ్ఞానం తో జయించి అద్వైతమే వైదిక మతపరమావధిగా అద్వైతమతాన్ని స్థాపించారు.
వీరు శరీరంతో జీవించింది కేవలం 32 సం.లు. నేటికి 2500 సం.లకు పూర్వం ఇప్పటి కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో శివగురు , ఆర్యాంబ పుణ్యదంపతులకు జన్మించారు. శంకర భగవత్పాదులు అపర ఈశ్వరఅవతారం. జ్ఞానులందరికీ చక్రవర్తి. వీరి అద్భుతమైనలీల ఒకటి జగమెరిగినదే – బాల శంకరులు భిక్ష కోరినపుడు ఒక ఇల్లాలు ఇంటిలో అంతా. వెదికి ఏమీలేక ఒక ఎండిపోయిన ఉసిరికాయను మాత్రం ఇస్తుంది. ఆమె నుదిటిపై ఉన్నదారిద్రరాతను చదివి శంకరభగవత్సాదులు జాలిచెంది శ్రీ మహలక్ష్మిని కనకధారా స్తోత్రంతో స్తుతిస్తారు. అమ్మవారు ప్రసన్నం చెంది ఆ ఇల్లాలి ఇంట్లోబంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు.
శంకరులు శ్రీ గోవింద భగవత్పాదుల వారిని గురువుగా స్వీకరించి వారి ఆదేశానుసారం అద్వైతవిద్య బోధిస్తూ వారణాసి చేరుకుంటారు. అక్కడ ఉండే కాలంలో వ్యాసులవారి బ్రహ్మసూత్రాలకు, భగ వద్దీతకుభాష్యాన్నిరచించారు. ఒకనాడు వృద్ధునిరూపంలో వ్యాసమహాముని శంకరులతో తీవ్రంగా వాదిస్తారు . ఆ సమయంలో శంకరుల శిష్యులు శ్రీ పద్మపాదుల వారు వచ్చినవారు వ్యాసులనితెలియపరచగా శంకరులు వారికి ప్రణమిల్లుతారు శంకరుల జ్ఞానానికి, భాష్యానికి సంతోషించి వ్యాసులవారు ఆశీర్వదించి అనుగ్రహిస్తారు.
వారణాసిలో ఒకసారి విశ్వేశ్వరుని దర్శించుకొని వస్తుండగా ఎదురుగా ఒక ఛండాలుడు 4 కుక్కలతో వస్తారు . అతనిని అద్దు తప్పుకుని దారి ఇమ్మని శంకరులు అంటారు. ఆ ఛందాలుడు అద్వైత సారాన్నంతా తెలియపరుస్తూ ఇలా ప్రశ్నించారు.
“ఓ విద్వత్తు కలిగిన బ్రాహ్మణుడా ! ఏది, దేనినుంచి, ఎక్కడికి వెళ్ళాలి ? ఆహారంతో తయారయిన ఈ నజీవ శరీరం వెళ్ళాలా? లేక సజీవమై ఉన్న ఈ చైతన్యాన్ని వేరుగా వెళ్ళమంటున్నావా? దేనిని భేదించమని అంటున్నావు?” నిరుత్తరులైన శంకరాచార్యులు. వారిని సాక్షాత్తు శివునిగా గుర్తిస్తారు .అధ్బుతమైన ‘మనీషాపంచకం” తో వారిని స్తుతిస్తారు. శంకరుల హిమాలయ యాత్రగురించి విశేషంగా చెప్పబడిన విషయాలు ఉన్నాయి . వారు హిమాలయాలలో కైలాస నివాసి ఐన శివుడిని,పార్వతీమాతను దర్శించాలని యోగశక్తితో అక్కడకు చేరుకుంటారు . ఆ ఆదిదంపతులను స్తుతించి శివుని ఆశీస్సులతో పాటు ఐదు. సృటిక లింగాలను పొందుతారు .లోక క్షేమం కోరి శంకరులు ఆ లింగాలలో ముక్తిలింగాన్ని కేదార్నాథ్ ఆలయంలో , వరలింగాన్ని నేటి నేపాల్లో ఉన్న నీలకంఠ క్షేతం లో , భోగలింగాన్ని కర్ణాటక లోని శారదా పీఠంలో,మోక్ష లింగాన్ని తమిళనాడులోని చిదంబరం లో ఐదవ లింగమైన యోగలింగాన్ని తన స్థానమైన కంచిలో స్టాపిస్తారు . ఈ లింగాలు శంకరుల కాలం నుండీ పారంపర్యంగా ఎప్పటికీ పూజలు అందుకుంటూనే ఉంటాయి.
ప్రసిద్ధమైన అద్వైత వేదాంత విద్యా మఠాలను శ్రీ శంకరులు ఏర్పాటు చేసారు . అవి శారదాపీఠం ,కంచికామకోటి పీఠం (సర్వజ్ఞపీఠం) , బదరీనాథ్ | హిమాలయ ప్రాంతంలో ), జగన్నాథ (పూరి లో ),ద్వారకా పీఠం ( గుజరాత్ లో ).
వివిధ గ్రంధాలలో శంకరులు పైవేకాక ఇంకాఎన్నో మఠాలను ఏర్పరిచారని, చరిత్రకారులు చెపుతున్నారు.
శంకరులు దేశంలోని చాలాప్రాంతాలలో పర్యటించారు. అందులో ముఖ్యంగా చెప్పవలసినవి- కాశి, ప్రయాగ, బద్రీనాథ్, కాశ్మీర్, చిదంబరం, జంబుకేశ్వరం, శ్రీరంగం, రామేశ్వరం,తిరుపతి ,ద్వారక ,పూరీ మొదలైనవి.
కంచిలో శ్రీ శంకరులు కామాక్షి అమ్మవారిమూర్తి ఎదురుగ శ్రీచక్ర స్థాపన చేసారు . ఆ శ్రీచక్రం ఇప్పటికీ , ఎప్పటికీ పూజలు అందుకుంటూనే ఉంటుంది.
చివరి కాలంలో వారు కంచిలోనే తన 32వఏట శివైక్యంపొందారు. సురేస్వరాచార్యులు, పద్మపాదులు( సనందులు ), తోటకాచార్యులు , హస్తామలకులు
శ్రీ శంకరుల శిష్యులలో ముఖ్యులు. శంకరులు కంచి పీఠాన్ని ,ఈ నలుగురు మిగిలిన నాలుగు పీఠాలను అధిష్టించారు. ఈ మఠాల ద్వారా శంకరుల జ్ఞానదీప్తి ప్రపంచానికి ఎప్పటికీ ప్రసరిస్తూనే ఉంటుంది.
శంకరుల తరువాత కంచి పీఠాన్ని అధిష్టించిన 68 వ ఆచార్యులు – “నడిచేదేవుడు”. గాప్రఖ్యాతి గాంచిన శ్రీ చంద్రశేఖర సరస్వతీస్వామి . వీరినే పరమాచార్యులని [మహాస్వామి అని, పెరియవ అని కూడా సంబోధిస్తారు