పితృ తర్పణము ఎలా చేయాలి ?

pitru tharpanam

(నేటినుండి) సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు గల “మహాలయపక్ష తర్పణం” విధిగా చేయాలి…!

మరణించిన మీ పితృదేవతల కోసం కేవలం 15 ని.ల సమయం కూడా మీరు కేటాయించుకోలేరా..??

దయచేసి మీ వంశాభివృద్ది కోసం 15 ని.ల సమయం కేటాయించుకోండి…!!

“పితృ తర్పణము” మీకు మీరే ఎలా మీ ఇంట్లో చేసుకోవచ్చో తెలుసుకోండి…!! తప్పక ఆచరించండి…!!!

కావలసిన వస్తువులు:-

పంచ పాత్ర, ఉద్ధరిణి,జలము, 50గ్రా. నల్ల నువ్వుల, ధర్భలు, చనిపోయిన వారి లిస్టు,గోత్రాలు…!

ఆచమ్య:-….

ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా |

ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః |ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీ కేశాయ నమః | ఓం పద్మ నాభయ నమః| ఓం దామోదరాయ నమః |

ఓం సంకర్షణాయ నమః |

ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః| ఓం అనిరుద్దాయ నమః |

ఓం పురుషోత్తమాయ నమ|| ఓం అధొక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః| ఓం జనార్దనాయనమః |

ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |

ఓం శ్రీ కృష్ణాయ నమః ||

పవిత్రం దృత్వా || ( దర్భ పవిత్రమును ధరించాలి)

ఓం పవిత్ర వంతః…… తత్సమాశత | ( మంత్రం వచ్చిన వారు చదువుకోండి )

పునరాచమ్య || ( మరల ఆచమనము చేయాలి )

భూతోచ్చాటన :-

ఉత్తిష్ఠంతు భూత పిశాచా, యేతే భూమి భారకాః | యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే | | | అని చెప్పి నీటిని వాసన చూసి వెనుకకు వేయాలి ,

(సాధారణ తర్పణాలకు నీరు,ప్రత్యేక తర్పణాలకు

తిలలు వాసన చూడాలి)

ప్రాణా యామము :- (ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని)

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓం

తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సు

వరోమ్ ||

( అని మనసులో జపిస్తూ ప్రాణా యామము చేయాలి )

సంకల్పం :- గుంటూరులో ఉండే వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.

క్రింద ఉన్నవి మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారతాయి.

కనుక సంకల్పాన్ని మిగతా ప్రదేశాల వారు మీ ప్రాంత పురోహితులని సంప్రదించగలరు)

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య – శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ,

శ్రీ గోవింద గోవింద గోవింద |

శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే|

ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే ,కృిష్ణా కావేర్యోర్మద్యదేశే|

సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన – వ్యావహారిక

చాంద్రమానేన -. శ్రీప్లవ నామ సంవత్సరే

దక్షిణాయనే…. వర్షఋతౌ…. భాద్రపద మాసే కృష్ణపక్షే

……తిదౌ……..వాసరే.|

శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య

తిధౌ|

ప్రాచీనావీతి:- ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)

మహాలయము : పితృణాం మాతామహాదీనాం సర్వీకారుణ్యానాంచ అక్షయ్య పుణ్యలోకా వాప్త్యర్దం కన్యాగతే సవితరి ఆషాడ్యాది పంచమాపరపక్షొ కర్తవ్య సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ద ప్రతినిధి సద్య, తిల తర్పణం కరిష్యే ||

సవ్యం:-

సవ్యమనగా ఎడమబుజము పైకి యజ్ఞోపవీతమును మార్చవలెను. సవ్యం చేసుకుని నీరు వదలాలి.

ప్రాచీనావీతి:- || మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను.

ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలు

పరిచి వాటి పై పితృదేవతలను

ఓం ఆగచ్చంతు మే పితర ఇమం గృహ్ణాంతు జలాంజలిమ్ ||”

అని చదువుతూ తిలలు వేసి ఆహ్వానించవలెను. దక్షిణముఖముగా తిరిగి, ఎడమ మోకాలు క్రింద ఆన్చి తర్పణ విడువవలెను.

“స్వధానమిస్తర్పయామి’ అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగా

ఇవ్వవలెను. వారి భార్య కూడా లేనిట్లైతే

సవిత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తకం అని చేర్చుకొనవచ్చును.

క్రింద మొదటి

ఖాళీలో అస్మత్ …… గోత్రమును, రెండవ చోట మరణించిన వారి పేరును …… శర్మాణం చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు “అస్మత్” అను శబ్దాన్ని చేర్చ వలెను.

బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది.

కానీ రాజులైతే వర్మాణాం .

వైశ్యులైతే గుప్తం అని, మిగిలిన

ఇతరు కులముల వారు (మీ మీ కుల తోకలు తగిలించుకుని) “దాసం” అని మాత్రమే పలకాలి.

(ప్రాచీనావీతి) అస్మత్ పితౄణాం అక్షయ పుణ్య లోక ఫలావాప్త్యర్థం. కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచమాపరపక్షే సకృన్మహాలయాఖ్యాన్న శ్రాధ్ధ ప్రతినిధి తిల తర్పణాని (సవ్యం)కరిష్యే…..(ప్రాచీనావీతి) దక్షిణాభిముఖో భూత్వా..

1) పితరం..(తండ్రి పేరు చెప్పి)

అస్మత్ …..గోత్రం, …. పేరు……శర్మాణం..వసురూపం..స్వధానమస్తర్పయామి.. అని 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…!!

2) పితామహం..(తాత)

అస్మత్ …… గోత్రం, ……. శర్మాణం.. రుద్రరూపం.. స్వధానమస్తర్పయామి అని

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

3)ప్రపితామహం.(ముత్తాత)

అస్మత్ ……గోత్రం, ………శర్మాణం… ఆదిత్య రూపం..స్వధానమస్తర్పయామి అని 3మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

4) మాతరం (తల్లి) గోత్రాం…దాయీం..వసురూపాం స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

5) పితామహీం (నానమ్మ) గోత్రాం..దాయీం..రుద్రరూపాం స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) గోత్రాం.. దాయీం..ఆదిత్యరూపాం

స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

7) సాపత్నిమాతరం ( సవితి తల్లి) గోత్రాం….దాయీం…వసురూపాం స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

8)మాతామహం (తాత . అనగా తల్లి గారి తండ్రి)

గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

9) మాతుః పితామహం (తల్లి గారి తాత)

గోత్రం..శర్మాణం… రుద్రరూపంవసురూపం.. స్వధానమస్తర్పయామి

3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

10)మాతుఃప్రపితామహం

(తల్లి యొక్క తాతగారి తండ్రి) గోత్రం…శర్మాణం.. ఆదిత్య రూపం వసురూపం.. స్వధానమస్తర్పయామి …3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

11) మాతామహీం.(అమ్మ మ్మ) గోత్రాం..దాయీం. వసురూపాం స్వధానమస్తర్పయామి…3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

12) మాతుః పితామహీం.(తల్లి యొక్క నానమ్మ)

గోత్రాం.. దాయీం.. రుద్రరూపాం వసురూపం.. స్వధానమస్తర్పయామి …3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) గోత్రాం… దాయీం.. ఆదిత్య రూపాం..వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి..

14) ఆత్మ పత్నీం ( భార్య) గోత్రాం.. దాయీం.. వసురూపాం.. వసురూపం.. స్వధానమస్తర్పయామి.. 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

15) సుతం (కుమారుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) గోత్రం..శర్మాణం.. వసురూపం

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

17) కనిష్ఠ భ్రాతరం ( స్వంత చిన్నసోదరుడు)

గోత్రం..శర్మాణం.. వసురూపం

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

18)తత్పత్నీం (సోదరుని భార్య.. వదిన)గోత్రాం..దాయీం వసురూపాం . స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

20)తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మ లు) గోత్రాం..దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

21)తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. గోత్రం… శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

23)మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

24) తత్పత్నీం (మేనమామ భార్య) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

25) దుహితరం (కూతురు) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

25) ఆత్మ భగినీం ( సోదరి. అక్క&చెల్లెలు) గోత్రాం.. దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

26)తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

27)దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

28) తత్పత్నీం (కూతురు యొక్క కొడుకు భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

29)భాగినేయకం ( మేనల్లుడు) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) గోత్రాం.దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

31) పితృ భగినీం ( మేనత్త & తండ్రి సోదరి) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

33)మాతృ భగినీం ( తల్లి సోదరి . చిన్న మ్మ. పెద్దమ్మ) గోత్రాం..దాయీం..

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

34) తద్భర్తారం ( తల్లి సోదరి యొక్క భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

35) జామాతరం ( అల్లుడు కూతురి భర్త) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

36)స్నుషాం ( కోడలు) గోత్రాం.దాయీం..

వసురూపాం. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

37)శ్వశురం ( పిల్లనిచ్చిన మామ)

గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన మామ భార్య.. అత్త) గోత్రాం..దాయీం..

వసురూపాం స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి

39)శ్యాలకం (బావమరిది) గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

40) తత్పత్నీం (బావమరిది భార్య) గోత్రాం..దాయీం.

వసురూపాం స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

41) ఆత్మ పత్నీం (భార్య)

గోత్రాం…దాయీం

వసురూపాం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

42)గురుం .. గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…

43)రిక్థినం ..

గోత్రం..శర్మాణం..

వసురూపం.. స్వధానమస్తర్పయామి ….అని 3 మారులు చెప్పి తిల తర్పణాలు జలముతో వదలాలి…!!!

యే బాంధవాః యే బాంధవాః యేయే అన్య జన్మని బాంధవాః |

తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన… వారిణా ||

ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితర స్సర్వే‌ మాతృ మతామహాదయః ||

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం ||

(యజ్ణోపవీత నిష్పీడనం)

యజ్జోపవీతమును నివీతిగా (దండలాగా) మెడలో వేసుకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింది విధంగా చదువవలెను.

||శ్లొ|| యేకే దాస్మత కులే జాతాః ఆపుత్రా గోత్రిణొ మృతాః | తే గృహ్ణంతు మయాదత్తం సూత్ర నిప్పిడనొదకం ||

( నా కులములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక! ]

శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞోపవీతపు ముడులను కళ్లకద్దుకుని సవ్యముగా చేసుకొనవలెను.

స్వస్థి…

మీ పితృదేవతల కోసం కేవలం ఈ 15 ని.ల సమయం కేటాయించండి.

సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 6 వరకు మహాలయపక్షం…!

ఈ పక్షము రోజుల్లో మీ సొంతవారి యొక్క చనిపోయిన తిథి నాడున లేదా తిథి తెలియనివారు 6వ తేదీ అమావాస్య నాడు ఈ తిలతర్పణం చేస్తే మీకు,మీ కుటుంబాలకు, మీ వంశాభివృద్దికి మంచి జరుగును, మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి.

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published.